టీడీపీ పతనావస్థకు ఇదే నిదర్శనం

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

అనంత‌పురం: రాజ్యసభలో  తెలుగు దేశం పార్టీ జోరో అయ్యింది.. ఆ పార్టీ పతనావస్థకు ఇదే నిదర్శనమ‌ని మంత్రి పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. శ‌నివారం అనంత‌పురంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాప్తాడు సిద్ధం సభకు సర్వం సిద్ధం చేశామ‌ని చెప్పారు. సిద్ధం సభ నుంచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావం పూరించింది.. భీమిలి, దెందులూరు సభలు ఇప్పటికే విజయవంతమయ్యాయ‌ని చెప్పారు. రాప్తాడు సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తరలి వస్తాయ‌ని తెలిపారు. టిక్కెట్లు దక్కని వారికి సముచిత ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ సంక్షేమ సారథి..దూషణలు, తిట్ల పర్వంతో టీడీపీ అభాసుపాలు అవుతుంద‌న్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమ‌ర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైయ‌స్ జగన్ 99 శాతం హామీలను అమలు చేశార‌ని మంత్రి పేర్కొన్నారు.

Back to Top