చిత్తూరు: చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే షర్మిల చదువుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో చంద్రబాబు.. వైయస్ఆర్ కుటుంబాన్ని చీల్చారని మండిపడ్డారు. శనివారం మంత్రి మాట్లాడుతూ.. సత్యవేడు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గురుమూర్తిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మన నాయకుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఇచ్చిన ప్రతీ హమీ, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ 99 శాతం అమలు చేశారని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న విద్యా, వైద్యానికి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఉరవకొండ సభలో ప్రజలే మద్దతుదారులు అని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వచ్చేది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనేది చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి సభల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగేది.. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. 66 లక్షలు పైచిలుకు పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్నీ అబద్ధాలే, ప్రజలు ఎవరు నమ్మవద్దు అని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలో లేనపుడు మరోమాట చంద్రబాబు నైజమని ఎండగట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.కుప్పంతో పాటు మరోచోట చంద్రబాబు పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.