చంద్రబాబు ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దు

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

 చిత్తూరు: చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చెప్తాడు.. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ట్రాక్టర్ ఇస్తానంటాడు.. యువకులకు మోటార్ సైకిల్ ఇస్తాను అంటాడు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుంగనూరులో ఏరియా ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఇసుక సీఎం వైయ‌స్ జగన్ తమ్ముడికి ఇస్తున్నామ‌ని ఎల్లో బ్యాచ్‌ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే టెండర్లు పిలిచాం, నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయి.. టెండర్లకు ఇంకా సమయం ఉంది… ఇంకా ఏమి కాకముందే సీఎం సోదరుడి పేరు చెప్పి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఒక్కసారి కూడా సచివాలయం మొహం చూడని వైయ‌స్ జగన్ ను 16 నెలలు జైలు లో పెట్టారు.. కానీ, ఆధారాలతో దొరికిపోయిన కూడా చంద్రబాబు తప్పు ఏం చేయలేదు అంటున్నారని దుయ్యబట్టారు. కొంత మంది ఏదో అన్యాయం జరిగింది అని రాద్ధాంతం చేస్తున్నారంటూ టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు .

 డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలుగుదేశం పార్టీని టెర్రరిస్టులతో పోల్చారు. వెన్నుపోటు దారుడు చంద్రబాబు.. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Back to Top