చంద్రబాబు స్కామ్‌లన్నీ త్వరలో బయటకొస్తాయి

బాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి మరెన్నో కేసులు ఎదుర్కోవాలి 

చంద్ర‌బాబుకు భయాన్ని ప‌రిచ‌యం చేసిన నాయ‌కుడు సీఎం వైయ‌స్ జగన్

టీడీపీ బంద్‌ పిలుపున‌కు హెరిటేజ్ కూడా మూతపడలేదు

చంద్రబాబు జైలుకి వెళితే.. ఎల్లో బ్యాచ్ విలవిల్లాడిపోతుంది

16 నెలలు వైయ‌స్ జగన్‌ని అన్యాయంగా జైలులో పెట్టారు

చంద్ర‌బాబు అనే అక్రమ వ్యవస్థ రామ్ లీల మైదానంలో రావణుడిలా కూలిపోయింది

విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

తిరుప‌తి: చంద్రబాబు అనే అక్రమ వ్యవస్థ రామ్ లీల మైదానంలో రావణుడిలా కూలిపోయిందని, బాబు అవినీతి వ్యవస్థను కోర్టు బోను ఎక్కించడం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకి భయం అంటే ఏంటో, పతనం అంటే ఏంటో వైయ‌స్ జగన్ రుచి చూపించార‌న్నారు. దాంతో రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభమైందని, ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికే పెద్ద పెద్ద పదవులు అన్న లోకేష్ వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్వ‌ర్గీయ‌ ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నార‌ని, పైనుంచి ఆయన ఆత్మ కూడా సంబ‌ర‌ప‌డి ఉంటుంద‌న్నారు. తిరుప‌తిలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి పెద్దిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
చంద్రబాబు తప్పు చేయలేదు అని బాబు త‌ర‌ఫు లాయర్లు, టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడటంలేదు.  బాబును 24 గంటలు దాటాక కోర్టులో ప్రవేశ పెట్టారు అని, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాత్రమే వారి న్యాయవాదులు మాట్లాడారు. ప్రభుత్వంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అవినీతి చేస్తే.. వాటిపై  కోర్టులో స్టే తెస్తే అది సక్రమం, ఆ స్కాములకు సంబంధించి చంద్రబాబును అరెస్ట్ చేస్తే మాత్రం అది అక్రమం అన్న‌ట్టుగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల పట్టాలు పై స్టే తెచ్చారు. మ‌హానేత వైయ‌స్ రాజశేఖర‌ రెడ్డి త‌న 26 ఎంక్వైరీలు వేశారు కానీ, ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అనేక సందర్భాల్లో అన్నాడు. కానీ, సీఎం వైయ‌స్ జగన్ ఆధ్వర్యంలో చంద్రబాబు అవినీతి బయట పడింది. ఇప్పుడు అరెస్టు చేస్తే.. భూమి ఆకాశం ఏకమైనట్టుగా గగ్గోలు పెడుతున్నారు. 

చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్లమీదకు రావట్లేదని స్వయంగా అచ్చెన్నాయుడు టెలి కాన్ఫరెన్స్ పెట్టి బాధపడుతున్నాడు. టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే హెరిటేజ్ కూడా మూతపడలేదు. చంద్రబాబు సొంత గ్రామంలో కూడా షాపులు తెరిచే ఉన్నాయి. 

గతంలో చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని వైయ‌స్ జగన్‌ను చంద్ర‌బాబు అక్రమంగా జైలుకు పంపారు. 16 నెలలు వైయ‌స్ జగన్‌ని అన్యాయంగా జైలులో పెట్టారు. ఒక్క రోజు చంద్రబాబు జైలులో ఉంటేనే  విలవిలలాడిపోతున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీలో గత ప్రభుత్వంలోని అనేక అంశాల్లో అవినీతిపై రిపోర్ట్ ఇచ్చాం. త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు, ఓటుకు నోటు కేసులో కూడా అనేక మీడియా సంస్థలు, వ్యక్తులు చంద్రబాబు కు మద్దతు పలికారు. పురందేశ్వరి కూడా చంద్రబాబు టీమ్ లో చేరిపోయారు. బెయిలు, హౌస్ అరెస్ట్ లాంటి అనేక పిటిషన్లు వేశారు. పైనున్న భగవంతుడు వీరి పాపాలు పండేలా చూస్తాడు. 

చంద్రబాబుకి భయం అంటే ఏంటో, పతనం అంటే ఏంటో సీఎం వైయ‌స్ జగన్ రుచి చూపించారు. దాంతో రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభమైంది.  ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికే పెద్ద పెద్ద పదవులు అన్న లోకేష్ వ్యాఖ్యలే దానికి ఉదాహరణ. చంద్రబాబు అనే అక్రమ వ్యవస్థ రామ్ లీల మైదానంలో రావణుడిలా కూలిపోయింది. బాబు అవినీతి వ్యవస్థను కోర్టు బోను ఎక్కించడం సీఎం వైయ‌స్ జగన్‌కే సాధ్యమైంది. 

దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ.. నేడు ముఖ్యమంత్రిగా సీఎం వైయ‌స్ జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక స్కాం లు జరిగాయి. వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. 

పవన్ కళ్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటుగా మారింది. గతంలో వలంటీర్ లపై ఆరోపణలు చేశాడు. నేడు 50 మంది హత్యకు పథకం అంటూ ఆరోపిస్తున్నాడు. పోలీసులను ఈ అంశాలపై విచారణ చేయాల్సింది గా కోరుతాం.. అబద్ధాలని తేలితే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు అరెస్ట్ విషయంలో దత్తపుత్రుడు పడినంత తపన సొంత పుత్రుడు కూడా పడలేదు. పవన్ కల్యాణ్‌ది నటనా లేక మరొకటా అనేది ప్రజలకు తెలుసు. 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుంది.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవు. చంద్రబాబు అరెస్టుకు.. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధం లేదు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి అవినీతి కేసులు మరెన్నో చాలా ఎదుర్కోవాలి. చంద్రబాబు అరెస్ట్ కి మేము సంతోష పడట్లేదు.. ఎవరైన సంతోషించారు అంటే అది ఎన్టీఆర్  అభిమానులు, ఆయన ఆత్మ మాత్రమే`` అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

Back to Top