అలసత్వం వహిస్తే సహించేంది లేదు

డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్ సరఫరా

విద్యుత్ శాఖ అధికారులుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

విజ‌య‌వాడ‌: వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించే  విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం విద్యుత్ శాఖ అధికారులుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు . వ్య‌వ‌సాయ కనెక్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులను రోజుల తరబడి పెండింగ్ లో పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరతాం అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంటాం. ఎక్కడైనా రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుల పై కఠినంగా చర్యలు తీసుకుంటామ‌న్నారు. 

రానున్న వేసవిలో డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్ సరఫరా జరగాల‌ని మంత్రి సూచించారు.  అందుకోసం ట్రాన్స్ కో తో డిస్కంలు సమన్వయం చేసుకోవాలి. రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కెవి స్టేషన్ల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేయాలి. కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇండోర్ సబ్ స్టేషన్ ల వల్ల ఎక్కువ వ్యయం అవుతోంది. అర్భన్ ప్రాంతాల్లో తప్పనిసరి అయితే మాత్రమే వాటిని ప్రతిపాదించాలి. రూరల్ ప్రాంతాల్లో ఇండోర్ స్టేషన్ల ను నిర్మించడానికి వీలులేదని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.  

Back to Top