తిరుపతి: నాణ్యమైన విద్యుత్ అందించేందుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రైతుల సమ్మతితోనే మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని చెప్పారు. రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ఈనాడు కథనం ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. మంగళవారం మంత్రి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
మోటార్లకు మీటర్లపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. రైతుల సమ్మతితోనే మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాం. రైతులు వాడిన విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తోంది. రైతు చెనుకు కడప మీటర్ అనే కథనాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలో రాశారు. ఈ మీటర్లు బిగించుకున్న రైతులకు డీబీటీ ద్వారా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. వారు ఎంత వాడితే ఆ విద్యుత్ చార్జీలు ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. మూడు డిస్కమ్‌లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల రైతుకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. డిస్కమ్‌లపై కూడా రెస్పాన్స్‌బులిటీ ఉంటుంది.
ఫైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో నెలవారి మీటర్ రీడింగ్‌లు నమోదు చేశాం. 18 వేల మీటర్ల పై చిలుకు రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. అక్కడ 30 నుంచి 33 శాతం అంటే మూడో వంతు సేవింగ్స్ వచ్చాయి. వీటి వల్ల విద్యుత్ చోరీలను అరికట్టేందుకు వీలుంటుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీబీటీ అకౌంట్లు రైతుల అనుమతితో సేకరించాం. గతంలో దీనిపై టీడీపీ ఆధ్వర్యంలో రైతు ముసుగులో మీటర్లు రైతులకు ఉరితాళ్లు అవుతాయని దుష్ప్రచారం చేశారు.
రైతులందరూ కూడా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని సుముఖత వ్యక్తం చేశారు. ఈ రోజు 18.58 లక్షల కనెక్షన్లు తీసుకున్నారు. దీనివల్ల సేవింగ్స్ వస్తున్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. ఏడాదికి రాష్ట్రంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో చంద్రబాబు హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పట్టించుకోలేదు. మా ప్రభుత్వంలో 48 గంటల్లోపు ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తున్నాం. రిజర్వ్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టుకున్నాం. మీటర్లు బిగిస్తే విద్యుత్ లో ఓల్టేజ్, హై ఓల్టేజ్ సమస్య రాదు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవం. 9.05.22న సమీక్ష సమావేశం నిర్వహించాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనమే విద్యుత్‌ను ఆదా చేస్తున్నాం. ఈ రోజు ఈనాడు కథనం రైతులను తప్పుదోవ పట్టించేలా ఉంది. మేం రద్దు చేసిన టెండర్లతో వారు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని అందుతున్నాయి. ప్రతి రైతు కుటుంబానికి నవరత్నాలు అందుతున్నాయి. వైయస్ జగన్ వినూత్నంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు చేయలేకపోయాడు..వైయస్ జగన్ చేస్తున్నాడని కడుపు మంటతో రామోజీరావు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఈనాడు కథనం అభూత కల్పన, తప్పుడు ప్రచారమని మంత్రి పెద్దిరెడ్డి ఖండించారు.
కొత్త అంచనాల ప్రకారం దాదాపు రూ.6 వేలతో రూ.1150 కోట్లు మాత్రమే మీటర్లకు ఖర్చు చేస్తున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. రామోజీరావు ఈ టెండర్లలో పాల్గొని రైతులకు తక్కువ ధరకే మీటర్లు అందించమని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. రైతులను, ప్రజలను, రాజకీయ పార్టీలను ఈనాడు రామోజీ రావు తప్పుదోవ పట్టిస్తున్నారు. రామోజీ, చంద్రబాబు టెండర్లలో పాల్గొనాలని సూచించారు. రామోజీరావుకు వయసు మీరినా కూడా కుట్రలు, కుతంత్రాలు పోవడం లేదు.మా నాయకుడు వైయస్ జగన్‌ను టార్గెట్‌గా పెట్టుకొని అసత్య కథనాలు రాస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఆయన హితవు పలికారు.