చిత్తూరు: తెలుగు రాష్ట్రాల ప్రజలు సిగ్గుపడేలా పవన్ కల్యాణ్ మాటలు ఉన్నాయని, ఆయన ఉపయోగించే భాష చాలా దారుణమని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్ తప్పుడు కూతలు కూస్తున్నారని, చెప్పులు చూపించే సంస్కృతి మనకు ఉందా..? అని ప్రశ్నించారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. మీరూ చేసుకోండి అంటున్న పవన్ కల్యాణ్ గురించి రాష్ట్రంలోని మహిళలే ఆలోచిస్తారన్నారు. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితమవుతారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఎదిరించాలంటే æ చంద్రబాబుకి ధైర్యం, బలం చాలదని, అందుకే తోకపార్టీలతో కలిసి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని, వారితో కలిసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడన్నారు. అందరూ కలిసి వచ్చినా సీఎం వైయస్ జగన్‌పై పైచేయి సాధించలేరన్నారు. 2024 ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ విజయం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.