అబద్ధాలే చంద్రబాబుకు ఎన్నికల అస్త్రాలు

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: తెలుగుదేశం పార్టీ మహానాడుకు మించి సామాజిక న్యాయభేరి సభకు ప్రజలు తరలివచ్చారని, అనంతపురంలో నిర్వహించిన సభ విజయవంతమైందని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  2024 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో మైనింగ్‌ మాఫియా జరుగుతుందని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల అస్త్రంగా చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. 
 

Back to Top