ప్రభుత్వంపై విషం చిమ్మడమే తండ్రీకొడుకుల పని

చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై బురదజల్లడమే చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్‌ పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలంతా చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని గమనిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా పాయింట్‌ వద్ద మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. 

పొత్తుల కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రోశం, పౌరుషం లేదంటూ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని, రాష్ట్రం శ్రీలంక మాదిరి అంటూ ఎల్లోమీడియాతో కలిసి విషప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థికసాయం అందించిన ఘనత వైయస్‌ జగన్‌కే సొంతమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చేసిన మేలు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలంతా హారతులతో ముందుకువచ్చి స్వాగతం పలుకుతున్నారని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెబుతున్నారని, చంద్రబాబుకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదని, ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని  ప్రభుత్వం మీద నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. 
 

Back to Top