జిల్లాల పున‌ర్విభ‌జ‌న చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం

పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

విజ‌య‌వాడ‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకున్న జిల్లాల పున‌ర్విభ‌జ‌న నిర్ణ‌యం చ‌రిత్రాత్మ‌కం అని పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. కొత్త జిల్లాల వ‌ల్ల ప్ర‌భుత్వ ప‌రిపాల‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కానున్న‌ట్టు చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని, హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పంచటం టీడీపి సంస్కృతని, ఇప్పటికే చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కోసం డబ్బులు కూడ‌పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, గతంకంటే వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top