పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదు

పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: ఒక్క సెంటు పంట నష్టపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల చిత్తూరు జిల్లాలో రోడ్లు, పంటలు 70 నుంచి 80 శాతం మేర నష్టం వాటిల్లిందని, వరద నష్టం అంచనా వేస్తున్నామని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  ఇది ప్రకృతి విపత్తు. ఊహించని వరదలు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగిందన్నారు. ఇందులో ఎవరి తప్పులేదన్నారు. చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదని, అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు 
 

తాజా ఫోటోలు

Back to Top