మోసం, విశ్వాసఘాతుకానికి ప్రతిరూపం చంద్రబాబు

బాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు

17వ తేదీ తర్వాత చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పం: ప్రతిపక్షనేత చంద్రబాబు పిచ్చి పతాకస్థాయికి చేరిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. విశ్వాసఘాతుకానికి, మోసానికి ప్రతిరూపం చంద్రబాబు అని దుయ్యబట్టారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి.. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక అసహనంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని, బాబు ఒళ్లంతా కుట్రలు, విషపూరిత ఆలోచనలతో నిండిపోయిందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉండి ఎన్టీఆర్‌పై ఏ రకమైన స్టేట్‌మెంట్లు ఇచ్చాడు.. టీడీపీలో చేరిన తరువాత ఎన్టీఆర్‌ మరణానికి ఏ విధంగా కారణమయ్యాడు..? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు బేరీజు వేసుకుంటే చంద్రబాబు లాంటి విశ్వాసఘాతకుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గురించి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. బాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, కుప్పం ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారని, ఈనెల 17వ తేదీ ఎన్నికల కౌంటింగ్‌ తరువాత చిత్తూరు జిల్లాకు చంద్రబాబు వచ్చే పరిస్థితి కూడా ఉండదన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top