కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

సొంత నియోజకవర్గ ప్రజలే బాబును అసహ్యించుకుంటున్నారు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేదలకు అండగా నిలిచారు

ఎన్ని అడ్డంకులు వచ్చినా మున్సిపల్‌ ఎన్నికలలోపు కుప్పానికి నీరందిస్తాం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పంలో వైయస్‌ఆర్‌ సీపీ బహిరంగ సభ, వేలాది తరలివచ్చిన జనం

చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల బతుకుల్లో ఆశలు చిగురించాయని, రెండున్నరేళ్ల పాలనలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో వైయస్‌ఆర్‌ సీపీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, ద్వారకానాథ్‌రెడ్డి, వెంకటేగౌడ్, కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. వైయస్‌ఆర్‌ సీపీ బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు.. కుప్పం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో సభకు పుంగనూరు, పీలేరు, పలమనేరు నుంచి జనాన్ని తరలించుకున్నారన్నారు. చంద్రబాబును సొంత నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ సభకు కుప్పం మున్సిపాలిటీ నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారంటే.. సీఎం వైయస్‌ జగన్‌పై కుప్పం ప్రజలకు ఉన్న ప్రేమ అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కుప్పం నియోజకవర్గం నుంచి 25 వేల మంది శాశ్వతంగా వలస వెళ్లారన్నారు. సుమారు మరో 20 వేల మంది రోజూ కూలీ పనులకు రైళ్లో బెంగళూరు, తమిళనాడు వెళ్తున్నారన్నారు. 

కుప్పంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు మంజూరు చేస్తే.. తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మకై సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు వేయించాడని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. గంగన్న శిరస్సు ప్రాజెక్టునూ ముందుకు జరగనివ్వలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. హంద్రీనీవా కాల్వను కుప్పం తీసుకురావడానికి చంద్రబాబుకు 5 సంవత్సరాలు పట్టిందా..? అని ప్రశ్నించారు. అనంతపురం చర్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు వదిలారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మున్సిపల్‌ ఎన్నికలలోపు కుప్పానికి నీరు రప్పిస్తామన్నారు. 
 

Back to Top