25 ఏళ్ల పెండింగ్‌ సమస్యను సీఎం పరిష్కరించారు

సీఎం చొరవతో పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు

పదోన్నతి పొందిన ఉద్యోగులు మంచి పనితీరు కనబర్చాలి

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సచివాలయం: రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరించారని, పంచాయతీరాజ్‌ శాఖలో ఇదొక చరిత్రగా నిలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 315 మంది ఎంపీడీఓలకు 25 ఏళ్లుగా ప్రమోషన్‌లు లేవన్నారు. దీని వలన 18,500 మంది పంచాయతీ రాజ్‌ ఉద్యోగులకు ప్రమోషన్‌లు రాలేదన్నారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ భావించారని, 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను సీఎం వైయస్‌ జగన్‌ పరిష్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 

సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘‘255 మందికి 12 క్యాడర్‌ల వారికి ప్రమోషన్లు ఇచ్చాం. బయట శాఖల నుంచి ఇప్పుడు అధికారులను తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు వీళ్లకు అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎవరూ తీసుకోలేకపోయారు. సీఎం వైయస్‌ జగన్‌ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగుల్లో కలిగింది. 

ఎంపీడీఓలందరికి ప్రమోషన్లు వస్తాయి. గిరిజాశంకర్, కమిషనర్‌ ఎంపీడీఓలు  అభివృద్ధిలో చాలా కీలకం. ఇప్పుడు పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతం అవుతుంది. కానీ ఇప్పుడు వీళ్లకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. పదోన్నతి పొందిన ఉద్యోగులు మంచి పనితీరు కనబర్చాలి. అమర్‌రాజా కంపెనీపై ఎలాంటి రాజకీయం చెయ్యలేదు. అది వెళ్లిపోవాలని మేం కోరుకోలేదు. అమర్‌రాజా కంపెనీపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదిక ఇచ్చింది. పీసీబీ నివేదిక ఆధారంగానే పరిశ్రమల శాఖ నోటీసులు ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో 4,5 వేల ఎకరాలు భూములు తీసుకున్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ నివేదికలు ఆధారంగా వెళ్లాలి’’ అని పేర్కొన్నారు. 
 

Back to Top