ప్రతి సంక్షేమ పథకం పేదల బాగుకోసమే..

‘జగనన్న తోడు’తో చిరువ్యాపారులకు సీఎం అండగా నిలిచారు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమం పేద బాగుకోసమేనని, సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు కాబట్టే.. ఆ కష్టాలను పేదవారి నుంచి దూరం చేయడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ‘జగనన్న తోడు’ పథకం ద్వారా చిరు వ్యాపారులకు అండగా నిలిచి ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు గానూ గతేడాది రూ.5.35 లక్షల మందికి సాయం అందించారని, రెండో విడతగా 3.70 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం నేడు విడుదల చేస్తున్నారని చెప్పారు. 

మాట మీద నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పరిపాలన ఏ విధంగా సాగుతుందో చెప్పడానికి, చూపించడానికి సీఎం వైయస్‌ జగన్‌ పాలన నిదర్శనమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. గతంలో నాయకులు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తుంగలో తొక్కారని, ఎన్నికల మేనిఫెస్టోను వారి వెబ్‌సైట్‌లో నుంచి తొలగించిన పరిస్థితి చూశామన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 96 శాతంపైగా ఎన్నికల హామీలతో పాటు చెప్పనివి కూడా నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట కోసం పట్టుదలతో ముందుకెళ్తున్నారన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసాను కల్పించారన్నారు. 
 

Back to Top