అవ‌స‌ర‌మైన ప్ర‌తి గ్రామంలో ఐసోలేష‌న్ సెంట‌ర్లు

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆదేశం
 

విజ‌య‌వాడ‌:  అవ‌స‌ర‌మైన ప్ర‌తి గ్రామంలోనూ ఐసోలేష‌న్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం మంత్రి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ దృష్ట్యా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.  గ్రామాల్లో కోవిడ్ బారిన ప‌డిన వారు ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.ఐసోలేష‌న్ సెంట‌ర్ల కోసం స్కూళ్లు, ఇత‌ర భ‌వ‌నాల‌ను వినియోగించుకోవాల‌న్నారు. గ్రామంలో హెల్త్ వ‌ర్క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కోవిడ్ బాధితులు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.డీపీవోలు, ఎంపీడీవోలు ఇందుకు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని చెప్పారు. మూడు రోజుల‌కోసారి పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్‌కు నివేదిక ఇవ్వాల‌ని మంత్రి ఆదేశించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top