చిత్తూరు: పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనతేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారని, ఆ క్రెడిట్ అంతా సీఎం వైయస్ జగన్‌దే అన్నారు. చంద్రబాబు కుప్పంలోనే మెజారిటీ సాధించలేకపోయారని, టీడీపీ కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. కుప్పంలో మేం చేసిన అభివృద్ధే వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను గెలిపించిందన్నారు. తిరుపతిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణస్వామితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో వైయస్‌ఆర్‌సీపీకి 82.27 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయని, రెండో విడతలో 2,676 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలుపొంది 80.43 శాతం కైవసం చేసుకున్నాం. మూడో విడత ఎన్నికల్లో 2574 సర్పంచ్ స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు. టీడీపీ కేవలం 13, 14 శాతం మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం 36 శాతం గెలిచామని, ప్రభుత్వ పతనం ప్రారంభమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు 2196 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి 15.8 శాతం వస్తే..వైయస్‌ఆర్‌సీపీకి 85.81 శాతం ఏకగ్రీవాలు వచ్చాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగితే 79 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీకి 14 పంచాయతీలు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ జరిగింది. కుప్పంలో చంద్రబాబు ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. సీఎం వైయస్ జగన్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేసినా..రాష్ట్ర ప్రజలు అవేవి నమ్మకుండా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. కుప్పంలో కూడా చంద్రబాబు క్లీన్ బౌల్డ్ అయ్యారు. గతంలో దొంగ ఓట్లతో గెలిచారు. కానీ ఈ రోజు చంద్రబాబు ఆటలు సాగలేదు. గతంలో ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా చంద్రమౌలిగా ఉండేవారు. ఆయన మరణాంతరం సీఎం వైయస్ జగన్ సూచనల మేరకు ఎంపీ రెడ్డప్ప, తదితరులు బాధ్యత తీసుకొని కుప్పంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు చెందుతుంది. మేం ఏది అడిగినా కూడా సీఎం వైయస్ జగన్ పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారు. మేం అభివృద్ధి చేయబట్టే ఓటర్లు మా పార్టీకి ఓట్లు వేశారు. చంద్రబాబు ఇన్నాళ్లు కుప్పానికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. నా గురించి చంద్రబాబు చాలా తప్పుడు ప్రచారం చేశారు. ఇవే కాదు..వచ్చే ఎన్నికల్లో కూడా కుప్పంలో వైయస్‌ఆర్‌సీపీ సత్తా చాటుతుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు అంగీకరించడం లేదు. నీ సొంత నియోజకవర్గంలో మా మద్దతుదారులకు 30 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇది గెలుపు కాదా? . ఇప్పటికైనా ఓటమిని అంగీకరించి పలాయానం చిత్తగించాలి. టీడీపీకి 2019 ఎన్నికలే చివరివని రాష్ట్ర ప్రజలు నాంది పలికారు. పంచాయతీ ఎన్నికల్లో అదే రుజువైంది. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. ఏది ఏమైనా ఈ విజయం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిది. సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయిన కారణంగా చంద్రబాబు నైతికబాధ్యత వహిస్తూ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. lకుట్రలు, కుతంత్రాలతోనే రాజకీయాలు చేస్తావా అన్నది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నాం. చంద్రబాబు కొన్ని వ్యవస్థలను చేతుల్లో పెట్టుకొని మాపై నీచరాజకీయాలు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీకి ఇంకా అధిక స్థానాలు సాధిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.