ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి

చిత్తూరు జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలికాన్ఫరెన్స్‌

విజయవాడ: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.చిత్తూరు జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నివర్‌ తుపాన్‌ కారణంగా సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా.. నివర్‌ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ముంపు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతో పాటు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top