‘జగనన్న తోడు’ చిరువ్యాపారుల ఉపాధికి ఊతం

వడ్డీలేని రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: ఇచ్చిన మాటను అమలు చేసే వరకు పట్టుదలతో పనిచేసే తత్వం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 3648 కిలోమీటర్లు సాగిన ప్రజా సంకల్పయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూసిన సీఎం వైయస్‌ జగన్‌.. ఆ కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. జగనన్న తోడు పథకం ప్రారంభానికి ముందు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని, ముఖ్యంగా చంద్రబాబు అనే వ్యక్తి ఏకంగా 100 పేజీల మేనిఫెస్టోలో 600 అబద్ధాలు చెప్పారన్నారు. కానీ, మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 2 పేజీల మేనిఫెస్టో తీసుకువచ్చి.. ఆ ఎన్నికల ప్రాణాళికను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ.. 17 నెలల కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 90 శాతంపైగా నెరవేర్చారన్నారు. 

సమాజంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి సాయం చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు ఇచ్చేందుకు  జగనన్న తోడు పథకం తీసుకువచ్చారన్నారు. ఎంతో మంది చిరు వ్యాపారులకు, సాంప్రదాయ చేతివృత్తిదారులకు ఈ పథకం ఉపయోగపడుతుందని, ఉపాధికి ఊతం ఇస్తుందన్నారు. ఈ వడ్డీలేని రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
 

Back to Top