ఇచ్చిన మాటకంటే మిన్నగా బీసీ సంక్షేమం

అడగకపోయినా సాయం చేసే గొప్ప నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

బలహీనవర్గాల అభ్యున్నతికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు

కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులు 50 శాతం మహిళలకే కేటాయింపు  

బీసీ గర్జనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: బలహీనవర్గాల అభివృద్ధికి నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే.. నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇచ్చిన మాట కంటే మిన్నగా బీసీలకు మేలు చేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బీసీ గర్జనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా జిల్లా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలకు నాలుగు కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు, 48 డైరెక్టర్‌ పదవులు ఇచ్చామన్నారు. బలహీనవర్గాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లను సీఎం వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని, కార్పొరేషన్ల పదవుల్లో 50 శాతం మహిళలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తుచేశారు. పాదయాత్రలో అందరితో మమేకమై.. ఏ కులానికి ఏ సమస్య ఉంది. ఏ ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారని, అందరి కష్టాలను ఆకలింపజేసుకున్నారన్నారు. అడగకపోయినా సాయం చేసే గొప్ప నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 

ఎన్నికలకు 10 నెలల ముందే బీసీ అధ్యయన కమిటీ వేసి బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తిని అధ్యక్షుడిగా నియమించి బీసీలు ఎదుర్కొంటున్న కష్టాలపై నివేదిక తయారు చేయించుకొని పూర్తిగా అవగాహన చేసుకున్నారన్నారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో ‘ నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని మాటిచ్చారన్నారు. బీసీల మేలు కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారని గుర్తుచేశారు. అదే వేదికపైగా బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీగా ప్రకటించారని గుర్తుచేశారు. బీసీ గర్జనలో ఇచ్చిన మాట కంటే మిన్నగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం బాటలు వేశారన్నారు. 
 

Back to Top