చంద్ర‌బాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

విజ‌య‌వాడ‌: చ‌ంద్ర‌బాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌పై పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. విచార‌ణ జ‌ర‌ప‌మ‌ని చంద్ర‌బాబు అడ‌గ‌డం సిగ్గుచేటని దుయ్య‌బ‌ట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో దొరికిన‌ప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయ‌లేదని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశార‌ని చెప్పి ఎందుకు విచార‌ణ చేయ‌లేదని నిల‌దీశారు. కేసీఆర్‌కు భ‌య‌ప‌డి చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచి పారిపోయి వ‌చ్చాడ‌ని, రాత్రికి రాత్రి విజ‌య‌వాడ వ‌చ్చేసి రాష్ట్రానికి ద్రోహం చేశాడని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడేమో హైద‌రాబాద్‌లో దాక్కుని ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఎందుకు పారిపోయాడో ఆయ‌న వ‌ర్గం మీడియా ప్ర‌శ్నించాలని డిమాండ్ చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top