ఆసుపత్రిలో వైద్యసేవలు మెరుగ్గా ఉన్నాయా? 

కరోనా బాధితులకు మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాల్‌..
 

విజయవాడ: కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, సదుపాయాలు, ఆహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. శుక్రవారం ఆయన వీడియో కాల్‌ ద్వారా విజయవాడ పిన్నమనేని  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యసేవలు మెరుగ్గా ఉన్నాయని,మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని బాధితులు తెలిపారు. 12 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నామని..నిన్న చేసిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని రోగులు చెప్పారు. ఆసుపత్రిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని మంత్రిని బాధితులు కోరాగా.. ఆయన స్పందిస్తూ తక్షణమే రోగుల సమస్యలను పరిష్కరించాలని జేసీ మాధవీలతను ఆదేశించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top