టీడీపీ శవరాజకీయాలకే పరిమితమైంది

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రజలంతా పోరాటం చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ మాత్రం శవరాజకీయాలకు పరిమితమైందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు సీఎం వైయస్‌ జగన్‌ అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి టీడీపీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top