ఇంత గొప్ప సీఎంను నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా..

ఆరు నెలల్లో 80 శాతం హామీలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు

నవరత్నాల్లో 8 అంశాలు పూర్తయ్యాయి

జగనన్న అమ్మ ఒడి పథకానికి చిత్తూరు వేదికవ్వడం గర్వంగా ఉంది

దౌర్జన్యాలు చేస్తే చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 80 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను నా రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న గొప్ప నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర పూర్తయింది.. ఈ రోజు అదే జనవరి 9న చిత్తూరులో జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించడం జిల్లా వాసుల అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేస్తే రాష్ట్రంలోని వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు చంద్రబాబును ఎక్కడా తిరగనివ్వరన్నారని హెచ్చరించారు. 

జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సభా వేదికపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికలు అయిన తరువాత ఆరు నెలల్లో హామీలు 80 శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు నా రాజకీయ అనుభవంలో చూడలేదని, ఇప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ను చూస్తున్నానన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికైన ఇద్దరు ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుకు ఎన్నికల హామీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. 2014లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఐదేళ్లలో వాటి గురించి ఆలోచన చేయలేదని, రాజధానిలో ఎంత దోచుకుందాం.. ఎన్ని వేల ఎకరాలను అమ్ముకుందాం..  రియలెస్టేట్‌ వ్యాపారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టాడన్నారు. 

మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలని చిత్తశుద్ధితో సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ రోజు రాజధాని గురించి చంద్రబాబు చాలా రాద్ధాంతం చేస్తున్నాడని, కొన్ని కుటుంబాలకు లాభం చేకూర్చేందుకు రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందా.. లేదా చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమకు జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ ఇవ్వడం మంచిది కాదా..? 40 సంవత్సరాల డిమాండ్‌ను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారన్నారు. దీనిపై రాయలసీమ వాసులు ఆలోచన చేయాలన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే నీకు వచ్చే ఇబ్బంది ఏంటీ చంద్రబాబూ అని ప్రశ్నించారు. అమరావతిలో వేల ఎకరాలను ఎలా అమ్ముకోవాలనే చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడని, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలపై దౌర్జన్యం కొనసాగితే రాష్ట్రం మొత్తం మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చంద్రబాబును రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వరన్నారు. చేసిన తప్పులకు పశ్చాతాపం కోరాలని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని టీడీపీ శ్రేణులు, చంద్రబాబుకు సూచించారు. మా నాయకులపై దౌర్జన్యం చేస్తే తిరిగి అదే విధంగా జవాబు చెబుతామన్నారు. నవరత్నాల్లోని అంశాలన్నీ అమలు చేశాం.. కేవలం ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఒక్కటే మిగిలిందన్నారు. నవరత్నాల్లో 8వ పథకం అమ్మ ఒడి పథకం చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. దాదాపు 43 లక్షల మంది తల్లులకు సంవత్సరానికి రూ.15 వేలు అందజేస్తున్నామన్నారు. 81.72 లక్షల మంది విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. రూ.6456 కోట్లు అమ్మ ఒడికి ఖర్చు చేస్తున్నామన్నారు. 

నాడు – నేడు కింద సంవత్సరానికి రూ.15 వేల స్కూళ్లను తీసుకొని వాటిని అభివృద్ధి చేసి నాడు ఎలా ఉన్నాయి.. నేడు ఎలా ఉన్నాయని చూపిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో విద్యలో అన్ని రాష్ట్రాలకంటే ముందు ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు రూ.20 వేలు ఇవ్వడం జరుగుతుందని, జగనన్న విద్యా దీవెనలో పైచదువులకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్య కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇంగ్లిష్‌ మీడియం ఉంటేనే ప్రపంచంతో పోటీ పడగలం, మంచి ఉద్యోగాలు పొందగలం అని ఆంగ్ల మాధ్యమ బోధనను తీసుకువచ్చారన్నారు. మధ్యాహ్న భోజన పథకం స్టాల్‌ దగ్గర వంట పదార్థాలను రుచి చేశారన్నారు. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనాన్ని పలానా మెనూ అని నిర్ణయం చేసినట్లుగా విన్నామా.. చూశామా.. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ వారానికి చెందిన మెనూ నిర్దేశించడం జరిగిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులను చేశారన్నారు. వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రజల గుమ్మం ముందుకే పాలన తీసుకెళ్లారన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు, పోలీసులకు వీక్లీఆఫ్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, రైతులకు ఆర్థికసాయం, స్కూల్‌ పిల్లలకు శనివారం నో బ్యాగ్‌ డే, స్పందన ద్వారా ఫిర్యాదు ఇస్తే ఏడు రోజుల్లో సమస్య పరిష్కరించడం, ఆశ వర్కర్ల జీతాల పెంపు, అగ్రిగోల్డ్‌ బాకీలు చెల్లింపు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం, బ్రహ్మణులకు, అర్చకులకు, పాస్టర్లకు, మౌలాన్‌లకు జీతాలు ఇచ్చారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారన్నారు. 
 

Back to Top