సోషల్ ఆడిట్ ప్రకారమే చెల్లింపులు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
 

పంచాయితీలకు ఎన్నికలు జరగలేదు. 14వ ఫైనాన్స్ డబ్బులు రాలేదు. అందుచేత ప్రభుత్వం 52,34,20,000 తో ప్రతిపాదనలు పంపింది. దానికి అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ చేయాలి. ఎస్సీపీడబ్ల్యూ స్కీమ్ గురించి అడిగారు. గోదావరి జిల్లాల్లో ఫిల్టర్లు రెండు మూడురోజులకు గానీ వడపోవడం లేదు. వడపోసిన అనంతరం పైన ఏర్పడే లేయర్ వల్ల సాండ్ పరిమాణం తగ్గుతోంది. ప్రకాశం జిల్లాలో చీరాల దగ్గర ఈ సాండ్ ఎక్కవ దొరుకుతోంది. సీ సాండ్ వాడుతున్న చోట్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి కానీ కొత్త సాండ్ పాలసీ వల్ల కాదు. ఫిల్టర్ బెడ్ లో పెద్ద ఎత్తున మొక్కలు, చెట్లు మొలిచాయి. ఇది గత ఆరునెలల కాలంలోది కాదు. గతంలో చాలా కాలం నుంచీ అక్కడ పరిస్థితి అలాగే ఉంది. గతంలో పూర్తి ఉచితంగా ఇసుక ఇచ్చేసామని, ఇప్పుడు అతి ఎక్కువ ధరలు ఉన్నట్టు ఇసుక విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మా ప్రభుత్వం రెండు లక్షల జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం చేసింది. ఇసుక అక్రమ తరలింపు అడ్డుకునేందుకు 450 చెక్ పోస్టులు పెడుతున్నాం. అన్నీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఒక అడిషనల్ డీజీని దీనికి నియమించాం. మరి ఇంతటి పటిష్టమైన చట్టాలతో ఇసుకను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఈ ఇసుక వల్లే అధికార పార్టీ నేతలు కోటీశ్వరులైపోయారని, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయని బుచ్చయ్యచౌదరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్కోనియోజకవర్గానికి తాగునీటి కోసం 1కోటి రూపాయిలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సాంక్షన్ చేసారు. ఎక్కడైనా మరమత్తులు వంటివి ఉన్నా ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చని శాసన సభ్యులకు తెలియజేస్తున్నాను.
వాటర్ గ్రిడ్ గురించి సభ్యులు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఉద్దానం, గోదావరి జిల్లాలు మొదటి ఫేజ్ గా, రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో 46,000 కోట్లతో ఈ ప్రతిపాదనలన్నీ ఇచ్చాము. త్వరలో ఇది ప్రారంభం అవుతుంది.
ఇసక గురించి వదిలేసి ఇప్పుడు ఫిల్టర్ల గురించి అడుగుతున్నారు. పశ్చిమ గోదావరిలో 818 ఫిల్టర్ బెడ్స్ ఉంటే 474 పని చేస్తున్నాయి. 344 పాక్షికంగా పనిచేయడం లేదు. ఇందుకోసం 16 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. తూ.గోలో 60 ఫిల్టర్ బెడ్ లు ఉంటే 37 పని చేస్తున్నాయి 23 పాక్షికంగా పనిచేయడం లేదు. ఒక్క తూగోలోనే 4,85,00,000 దీనికి ఖర్చు అవుతుంది. దీన్ని వెంటనే చేపట్టడం జరుగుతుంది. ఇసుక వల్ల ఈ రాష్ట్రంలో ఇబ్బందులేమీ లేవు. గోల్డ్ స్మిత్ చనిపోతే ఇసుక వల్ల చనిపోయాడంటూ ప్రతిపక్షానికి చెందిన ఓ నాయకుడు భలే గొప్పగా మాట్లాడాడు. ఇసుక ఉంటే మేస్త్రీలకు పని ఉండేదని, మేస్త్రీలకు పని ఉంటే కేజీలకు కేజీలు బంగారం కొనేవారని, బంగారం కొంటే పని ఉండేదని, ఇసుక లేకపోవడం వల్లే పని లేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఎక్కడ ఎవరు చనిపోయినా ఇసుక వల్లే అని ప్రచారం చేసారు. ఇప్పుడు ఇంకోటి తీసుకొస్తారు. ప్రభుత్వం మీద బురద చల్లడం తప్ప మరో కార్యక్రమం వీళ్లకు లేదు.
మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందట ఆ చందంగా వుంది టీడీపీ తీరు. తప్పుడు రాతలు రాస్తారు ఢిల్లీకి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీ వేతనాల కోసం 4162 కోట్ల రూపాయిలు రిలీజ్ చేసింది. 26.11.2019 దాకా పూర్తిగా చెల్లించాం. ఈ 20 రోజులకు గాను 66 కోట్ల 39 వేల బకాయిలున్నాయి. ఇందులో కేంద్రం వాటా 1849.38 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్రం వాటాగా 574.8 కోట్లు చెల్లించాం. మొదటి విడతలో కేంద్రం వాటా 367.66 కోట్లు, రెండో విడతలో కేంద్రం వాటా 641.44, మూడో విడతలో కేంద్రం వాటా 836 కోట్లు, నాలుగో విడత 4.32 కోట్లు. మొత్తంగా చూస్తే 1849.38కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. రాష్ట్రం వాటా సంగతి చూస్తే మొదటి విడత 80.88, రెండో విడత 213.80, మూడో విడత 278.68, నాలుగో విడత 1.44 కోట్లు మొత్తం కలిపితే 574.8 కోట్లు రాష్ట్రం వాటా. కేంద్ర రాష్ట్ర వాటాలు కలిపి 2424.18 కోట్ల వచ్చాయి. బాబుహయాంలోని గత రాష్ట్ర ప్రభుత్వం 2015, 2016 మరియు 2017, 2018 సంవత్సరాల్లో అడ్వాన్స్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చే దానికి అదనంగా 2643.34 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు చేసారు. ఉపాధి హామీలను ఓవర్ లాప్ చేసి, అవే పనులను నీరు చెట్టు కింద బుక్ చేసి 4000 కోట్లు చెల్లించారు. ఇంకా 1180 కోట్లు నీరు చెట్లు బకాయిలు పెట్టారు. ఉపాధి పనులు, నీరు చెట్టు పనులు వేరు కాదు. పంచాయితీలో ఎంక్వైరీ చేస్తే ఈ నిజాలు తెలిసాయి. కేంద్రం ఇచ్చిన దానికంటే ఎక్కువ చెల్లించారు.
సోషల్ ఆడిట్ కు లోబడి నిధులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ నిధులు మళ్లిస్తున్నారంటూ చంద్రబాబు, ఆయన ఎంపీలు ఢిల్లీకి లేఖలు  రాస్తున్నారు. తప్పుడు లేఖలు కేంద్రానికి పంపుతూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటున్నది చంద్రబాబు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.

 

Back to Top