సీఎం వైయస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే టీడీపీ అక్కసు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మంచి పేరు వస్తుందని టీడీపీకి అక్కసు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. గురువారం చిత్తూరు జిల్లాలో పలువురు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో విప్లవాత్మక బిల్లులు పెట్టామని చెప్పారు. 
 

Back to Top