మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

విజయవాడ:  మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంపై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ..జగనన్న పచ్చతోరణంలో అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయామని చెప్పారు. రానున్న రెండు మూడు నెలల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఉపాధిలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నామని, మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ఇలాగే మొదటి స్థానంలో నిలవాలన్నారు. అందరూ అధికారులు సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top