డిప్యూటీ సీఎంగా నారాయ‌ణ‌స్వామి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

స‌చివాల‌యం: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా కె.నారాయణస్వామి బాధ్యతలు స్వీక‌రించారు.  సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన చాంబర్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం బాధ్యతలు చేప‌ట్టారు. డిప్యూటీ సీఎం నారాయ‌ణస్వామికి ప‌లువురు అధికారులు, నేత‌లు అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం ఎక్సైజ్‌శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ.. త‌మ‌ది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు.

తాజా వీడియోలు

Back to Top