ఆ ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌దే

కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా

 మంత్రి మోపిదేవి వెంకటరమణ 

గుంటూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మ‌హిళ‌ల‌కు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు కేటాయించిన ఘనత వైయ‌స్ జగన్ కే చెల్లిందని మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ కితాబిచ్చారు. కుల రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటని... అవసరాలకు కులాలను వాడుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.గుంటూరులో సోమ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మోపిదేవి మాట్లాడారు. ఏ పార్టీలోనూ పార్టీ కోసం పని చేస్తున్న వారికి సరైన ప్రాధాన్యత లభించడం లేదని... వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  శ్రమిస్తున్న వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తగు ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అన్ని కులాల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. తనపై నమ్మకంతో రాజ్యసభకు పంపిస్తున్నారని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులను తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.  రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు రాజకీయపరంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం తాను శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top