మేనిఫెస్టోలోని అంశాలు 90 శాతం నెరవేర్చాం

పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నూతన పరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. గుంటూరులో మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. మేనిఫెస్టోలోని అంశాలతో పాటు మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నారని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకం ప్రజల గుమ్మం ముందుకే తీసుకువస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని అంశాలు 90 శాతం నెరవేర్చామని, సీఎం వైయస్‌ జగన్‌ పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. 

 

Back to Top