రాష్ట్రంలోకి రావాలంటే చంద్రబాబుకైనా క్వారంటైన్‌ తప్పనిసరి

పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

విజయవాడ: హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి రావాల్సిందేనని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.  ఈ విషయంలో ఎవరిని మినహాయించేది లేదన్నారు. మంత్రి మోపిదేవి మీడియా మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వకుండా హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార యంత్రాంగం తలమునకలై పనిచేస్తున్నారన్నారు.  రైతులకు నష్ట్రం రాకుండా అన్ని జాగ్రత‍్తలు తీసుకున్నామని చెప్పారు. ఆక్వా రంగానికి కనీస ధర నిర్ణయించామన్నారు. ఆక్వా ఫిషరీస్‌ రంగాలపై వచ్చిన నష్ట్రాలపై రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక అందజేస్తామని మంత్రి మోపిదేవి తెలిపారు. 
 

Back to Top