రాభ్యసభకు వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు

9 నెలల్లో నే సీఎం వైయస్‌ జగన్‌ చారిత్రత్మాక నిర్ణయాలు తీసుకున్నారు

తన అవసరాలకు వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు

ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వైయస్‌ జగన్‌ మొదటి స్థానంలో ఉంటారు

వైయస్‌ జగన్‌ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు

మంత్రి మోపిదేవి వెంకటరమణ

తాడేపల్లి: రాజ్యసభకు వెళ్తానని తానెప్పుడూ అనుకోలేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఇవాళ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ 9 నెలల్లోనే అనేక చారిత్రాత్మక, విప్లవాత్మకమైన నిర్ణయాలతో పాటు రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ మనుగడకు, అభ్యున్నతికి పాటుపడుతున్న కార్యకర్తలకు విలువను ఇస్తూ, వారి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నాయకులను మన అవసరాల నిమిత్తమే ఉపయోగించుకోవడం, గత పాలకులు, చంద్రబాబు మాదిరిగా కాకుండా అవసరం తీరేవరకు ఆ వ్యక్తులను ఏ విధంగా ఉపయోగించుకుంటారో తెలుసు. అవసరం తీరిన తరువాత ఆ వ్యక్తిని కరివేపాకులా తీసి వెలుపల పడేస్తారు. ఇది చంద్రబాబు నైజం. దీనికి పూర్తి భిన్నంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కార్యకర్తలు, నాయకుల  విలువ, ప్రతిష్టలను పెంచే విధంగా వారిని అన్ని విధాలుగా పార్టీ కోసం ఉపయోగించుకోవడమే కాకుండా, అవసరం వచ్చినప్పుడు వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనే సంపూర్ణమైన రాజకీయ భావంతో పరిణతి చెందిన నాయకుడిలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కూడా వైయస్‌ జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వైయస్‌ జగన్‌ స్థానం పొందారు. ఈ రోజు మమ్మల్ని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. మేం ఎవరూ కూడా ఊహించలేదు. రాజ్యసభలో అడుగు పెడతామని ఊహించలేదు. మా ఊహలకు అందని విధంగా, రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల ఊహలకు అందని విధంగా ప్రజల అవసరాలు, వారి సంక్షేమం తెలిసిన వ్యక్తిగా వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు గౌరవమైన గుర్తింపు తీసుకువచ్చే విధంగా మమ్మల్ని ఎంపిక చేశారు. రాష్ట్రంలోనే బీసీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ప్రతి వ్యక్తి కూడా  ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పని చేయాలని భావిస్తున్నాడు. ఈ అవకాశం కల్పించిన వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..

సీఎం వైయస్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడు: అయోధ్య రామిరెడ్డి
 సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నాను. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణను రాజకీయాల్లో వాడుకునే విధానం బాగుంది. అలాగే పరిమళ్‌ నత్వానీ, తనను ఎంపిక విషయంలో వైయస్‌ జగన్‌ ముందు చూపు కనిపిస్తుంది. మా ఇద్దరిని అభివృద్ధిలో ఏవిధంగా ఉపయోగించుకోవాలో అని సీఎం వైయస్‌ జగన్‌ ముందు చూపుతో చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేసేందుకు సంతోషిస్తున్నాను. దేశ విదేశాల్లో ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. మాకు ఉన్న అనుభవంతో రాష్ట్రంలో మౌలిక వసతులు, పరిశ్రమల ఏర్పాటు, స్వచ్ఛ్‌, మేకిన్‌ ఇండియా వంటి ఆలోచనలతో రాష్ట్రానికి మేలు చేసే విధంగా పని చేస్తాం. మేమంతా కూడా అనుభవంతో రాజ్యసభలో పని చేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌, పార్టీ నాయకులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top