ఆక్వా రంగానికి మంచి రోజులు 

అసరమైన ప్రాంతాల్లో జెట్టీల ఏర్పాటు 
 

రూ.100 కోట్లతో విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌ విస్తరణ

నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టులు విస్తృతపరచడంలో భాగంగా సెకండ్‌ ఫేస్‌లో ఫిషింగ్‌ జట్టీలు ఏర్పాటు

కేస్‌ కల్చర్‌ ద్వారా మత్స్యరంగాన్ని ప్రోత్సహిస్తాం

మరో 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ నుంచి విడుదల

మంత్రి మోపిదేవి వెంకటరమణ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆక్వా రంగానికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్‌ ఉంటుందని, ఆక్వారంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.  అవసరమైన ప్రాంతాల్లో మేజర్‌, మైనర్‌ జెట్టీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మరో 8 మంది మత్స్యకారులను సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో విడుదల కాబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో మోపిదేవి మీడియాతో మాట్లాడారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం దేశం మొత్తం మీద ఏపీలోనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో మెరైన్స్‌ ఎగుమతి చేసే దాంట్లో విదేశీ మారకద్రవ్యం వస్తున్న 40 శాతం మేజర్‌ కంట్రీబ్యూషన్‌ ఒక్క ఏపీ నుంచే వస్తుంది. ఇలాంటి పరిణామాలతో మెరైన్‌ సెక్టార్‌ను ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనువైన ప్రాంతాల్లో ఫిషింగ్‌ జెట్టీలు,  జిల్లాలో ఒక మెజార్‌ పోర్టులు, ఒకటి రెండు ప్రాంతాల్లో మైనర్‌ జెట్టీలు నిర్మించాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. అక్వా రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పవర్‌ టారీఫ్‌ విషయంలో యూనిట్ కాస్ట్‌ రూ.1.50 చొప్పున ఇవ్వడంతో ప్రభుత్వానికి అదనంగా సుమారు రూ.550 కోట్లు భారం పడుతోంది. మెరైన్‌ సెక్టార్‌కు సంబంధించి అనువైన ప్రాంతాల్లో మేజర్‌ జట్టీలు, మైనర్‌ జట్టీలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే సర్వేలు చేశారు. ఇందులో భాగంగానే పోర్టులు ఉన్న 9 జిల్లాలో దాదాపుగా 22 ప్రాంతాల్లో జెట్టీలు ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఫేస్‌1, ఫేస్‌-2 జట్టీలుగా విభజించాం. ప్రకాశం జిల్లాకు ఓడరేవు, గుంటూరు జిల్లాకు ఫేస్‌-2 జట్టీగా నిజాంపట్నం, మచిలీపట్నం, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఉప్పాడలో ఫేస్‌-1 జట్టీ, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె జట్టీలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే  అనుమతులు వచ్చాయి. ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో 50 శాతం కేంద్రం భరించేలా, మిగిలింది నాబార్డ్‌ నుంచి ఆర్థిక సాయం తీసుకొని ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభించాలనే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, ఎద్దువానిపాలెం, విశాఖలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఫిషింగ్‌ హార్బర్‌గా ఉన్న విశాఖలో రూ.100 కోట్లతో ఆధుకీకరించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అనువైన అన్ని ప్రాంతాల్లో ఫిషింగ్‌ జట్టీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్‌ తీరప్రాంతానికి బతుకుదెరకు కోసం వెళ్లి పాకిస్థాన్‌ బార్డర్‌లోకి వెళ్లడంతో వారిని ఇటీవలే సీఎం వైయస్‌ జగన్‌ విడిపించారు. ఇక్కడ మేజర్‌ జట్టీలు లేకపోవడంతోనే అంత సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారని బాధితులు సీఎంకు చెప్పారు. స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని రెండు ప్రాంతాల్లో మేజర్‌ జట్టీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఫిషింగ్ యాక్టివిటిస్‌ పెంచాలని సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కేస్‌ కల్చర్‌ ద్వారా ఫిషరిస్‌ సెక్టార్‌ను అభివృద్ధి చేయాలని, కొత్త వంగడాలను ప్రోత్సహించాలని ప్రత్యేక యాక్ట్‌ తయారు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రంగంపై ఆధారపడి జీవించేవారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్‌ ఉంటుంది. 
మరో 8 మంది మత్స్యకారులు విడుదల
వలస వెళ్లి పాకిస్థాన్‌ బార్డర్‌లో చిక్కుకున్న 22 మందిని సీఎం వైయస్‌ జగన్‌ ఇది వరకే విడుదల చేయించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది గత ఆరు నెలల క్రితం చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్‌ బార్డర్‌లో చిక్కుకున్నారు. వీరిని కూడా విడిపించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఇవాళ ఆ 8 మందిని బంగ్లా దేశ్‌ విడుదల చేస్తోంది. 4 రోజుల్లో బందీలంతా స్వగ్రామాలకు చేరుకుంటారు. 

తాజా వీడియోలు

Back to Top