సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో మత్స్యకారులు తిరిగొచ్చారు

సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులు

ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన సీఎం వైయస్‌ జగన్‌

మత్స్యకారులను విడిపించేందుకు గత ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు

మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా జెట్టీలు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ

మంత్రి మోపిదేవి వెంకటరమణ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవతోనే మత్స్యకారులు పాకిస్థాన్‌ నుంచి తిరిగి దేశానికి వచ్చారని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. పాక్‌ చెర నుంచి విడుదలైన 20 మంది మత్స్యకారులు బుధవారం సీఎం వైయస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సీఎంవైయస్‌ జగన్‌ ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడారు. 

బతుకుదెవరు కోసం గుజరాత్‌కు వెళ్లిన 22 మంది మత్స్యకారులు ఫిషింగ్‌కు వెళ్లి దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌ ప్రాంతంలోకి వెళ్లడం, అక్కడ కోస్ట్‌గార్డులు వీరిని అరెస్టు చేశారు. గత 14 మాసాలుగా వీరు పాకిస్థాన్‌ చెరలో ఉన్నారు. మరల తిరిగి మా ప్రాంతాలకు వెళ్తామా? లేదా అన్న అభద్రతాభావంతో బతుకుతున్న 22 మంది మత్స్యకారులను విడిపించే విషయంలో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కుటుంబ సభ్యులను విడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని అప్పట్లో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ మేరకు గడిచిన ఆరు మాసాల్లో నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ..మత్స్యకారులను బయటకు తీసుకురావడంలో వైయస్‌ జగన్‌ సఫలికృతమయ్యారు. 22 మందిలో 20 మంది ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారు. మరో ఇద్దరు సాంకేతిక సమస్యలతో అక్కడే ఉన్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఆ ఇద్దరు కూడా తిరిగి వస్తారని విశ్వాసం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా వాఘా బార్డర్‌ వద్ద  భద్రతా దళాలు భారత్‌కు అప్పగించినప్పుడు ఇది కలా..నిజమా అన్న ఆశ్చర్యకరమైన భావనతో మత్స్యకారులు ఉన్నారు. ఇది నమ్మలేకపోతున్నామని చెప్పారు. చాలా నిస్తేజంగా, నిర్వీర్యమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ఇవాళ వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్నామని సంతోషంగా ఉన్నారు. సీఎంను కలిసిన సందర్భంలో ఏ కారణం చేత మీరు గుజరాత్‌కు వెళ్లాల్సి వచ్చిందని వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతుందని సీఎం ఆరా తీస్తే..మా ప్రాంతంలో సరైన పిషింగ్‌ హార్బర్‌ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో అనువైన చోట ఫిషింగ్‌ హార్బర్‌ కట్టించాలని సీఎంను కోరారు. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో  ఎక్కడైతే ఫిషింగ్‌ జట్టీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ దిశగా ప్రక్రియ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను గుర్తించి జట్టీలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఇది మంచి అవకాశం. కష్టమో? నష్టమో ఇవాళ వారంతా కూడా బయటకు వచ్చారు. పాకిస్థాన్‌, భారత దేశానికి ఉన్న మధ్య సరైన స్నేహపూర్వక వాతావరణం లేని ఇలాంటి పరిస్థితిలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ చూపి వీరందరిని విడిపించడం సామాన్యమైన విషయం కాదు. మాకున్న అధికారిక లెక్కల ప్రకారం సుమారు 400 మంది పాకిస్థాన్‌ బార్డర్‌కు వెళ్లి అక్కడ జైళ్లలో మగ్గుతున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి 400 మంది ఉన్న సమయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ కృషి, పట్టుదల వల్ల 20 మందిని విడిపించగలిగారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి తరుణంలో  ఆ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి. సీఎం వైయస్ జగన్‌ చొరవ తీసుకొని ఆరు నెలల్లో వీరిని విడిపించడం ఒక భాగమైతే.. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వీరి యోగక్షేమాల కోసం నామమాత్ర ప్రయత్నాలు చేసింది. అధికారికంగా కేంద్రానికి వినతిపత్రాలు ఇచ్చి ఫోటోలు తీయించుకుని అక్కడికే పరిమితమైంది.  మత్స్యకారులను విడిపించేందుకు గత ప్రభుత్వం చూపిన చొరవ శూన్యం. ఈ రోజు  సీఎం వైయస్‌ జగన్‌ కృషి, ప్రయత్నం వల్ల వీరందరూ బయటకు వస్తే..తమ వల్లే విడుదల అయ్యారని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ప్రచారం చేసుకుంటున్నాడు. అప్పుడెప్పుడో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పెట్టి ఇదిగో..నేను ప్రయత్నం చేశానని ప్రచారం చేసుకుంటున్నారు. 8 మాసాలు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం ప్రయత్నం చేయని వ్యక్తులు ఇవాళ గొప్పలు చెప్పుకోవడం సరైంది కాదు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకించి ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొంత మంది ఎంపీలను ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు వారిని విడుదల చేయించాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ఇలాంటి ప్రధాన ఘట్టాన్ని కూడా రాజకీయ కోణంలో మాట్లాడటం సరైంది కాదు. తీరప్రాంతాల్లో అనువైన చోట మేజర్‌ జట్టీలు, ఫిషింగ్‌ జట్టీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఎవరూ కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అనువైన ప్రాంతంలోనే వృత్తులతో జీవనం సాగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

Back to Top