టీడీపీ నేతల తీరు దుర్మార్గం

మంత్రి మోపిదేవి వెంకటరమణ
 

అమరావతి: చారిత్రాత్మకమైన బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు సభలో అనుసరించిన తీరు దుర్మార్గమని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. సభలో మహిళలకు సమాన హక్కుల బిల్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ బిల్లులు ఆమోదించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ..సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడుతూ..ఇన్నాళ్లు చంద్రబాబు కులాల మధ్య కుంపట్లు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారన్నారు.

ఇలాంటి రాజకీయాలకు పుల్‌స్టాఫ్‌ పెట్టి శాశ్వతమైన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. కులాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మంచి నిర్ణయం తీసుకునే సమయంలో టీడీపీ నేతలు అడ్డుపడటం సిగ్గుచేటు అన్నారు. మొట్టమొదటి సారి టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి బిల్లులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రపంచ బ్యాంకు లొసుగులు ఎక్కడ బయటపడుతాయో అని భయంతో స్వార్థపూరితమైన కుట్రలో భాగంగా సభలో గందరగోళం చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్నింటిలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు, పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకువచ్చిన బిల్లులను స్వాగతిస్తున్నామని చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top