శ్రీకాకుళం: రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. పేదల పక్షాన సీఎం వైయస్ జగన్, పెత్తందార్ల పక్కన బాబు ఉన్నారని చెప్పారు. ఇచ్చాపురం నుంచి వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార యాత్ర ఇవాళ ప్రారంభమైంది. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సీఎం వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని చెప్పారు. నాడు–నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చామని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయనివారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచామని వివరించారు. మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు.