తిరుపతి: 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చంద్రబాబు సృష్టించారు. అర్హత ఉన్న ఓట్లు ఉండాల్సిందే. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ బాధ్యతల స్వీకరించిన తర్వాత ఒక సామాజిక విప్లవానికి తెర తీశారని, రాష్ట్రంలో ఎక్కడా కూడా అసమానతలు లేకుండా, అశ్రుత పక్షపాతం లేకుండా చేశారని కొనియాడారు. పేద ప్రజల గుండెచప్పుడుగా పరిపాలన జరుగుతోందన్నారు. మును పెన్నడ లేనివిధంగా ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలు డిబిటి రూపేనా సీఎం జగన్ అందించారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఒక మంచి పని చేయలేదన్నారు.. ప్రజలను మోసం చేసేందుకు ఏమార్చేందుకు చంద్రబాబు తిరుగుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన చంద్రబాబు.. మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు వస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.