ప్రశ్నిస్తే చెప్పు తీసుకొని కొడతానంటావా బాబూ...?

మంత్రి మేరుగు నాగార్జున

విశాఖపట్నం:  క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని కావాల‌ని ప్ర‌శ్నిస్తే చెప్పు తీసుకొని కొడ‌తానంటావా చంద్ర‌బాబూ అంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిప‌డ్డారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారు ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటే .. చంద్రబాబు 29 గ్రామాలే బాగుండాలని వికేంద్రీకరణ వద్దు, తన అమరావతే ముద్దు..  అని ప్రజలను మభ్యపెట్టే పరిస్థితికి వెళ్తున్నాడు. తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు.వైయ‌స్  జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టే  పథకాలు, జగన్ గారి ఆలోచన, వైయ‌స్ జగన్ గారి పనితీరు .. ఏ దేశ చరిత్రలో అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా ఇంతలోతుగా, క్షేత్రస్థాయిలో, సామాజిక స్పృహతో అధ్యయనం చేశారా..? 
 చంద్రబాబు మాత్రం.. 29 గ్రామాల్లో రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు.. అమరావతి రాజధాని వస్తే.. తన భూముల ధరలు అంతకు పదింతలు పెంచుకోవాలని చూస్తున్నాడు.   చంద్రబాబుకు వికేంద్రీకరణ గురించి- మూడు రాజధానుల గురించి మాట్లాడే అర్హత గానీ, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారిని విమర్శించే నైతికతగానీ లేవు అన్నారు.  చంద్రబాబు సానుభూతి డ్రామాలన్నీ బెడిసి కొట్టాయని చెప్పారు.  కర్నూలు లో వికేంద్రీకరణ గురించి యువత-విద్యార్థులు ప్రశ్నిస్తే.. చెప్పు తీసుకుని కొడతానంటున్నాడు  చంద్రబాబు.   ప్రజల్లో తనకు వస్తున్న వ్యతిరేకతను  చూసి చంద్రబాబు అసహనానికి గురవుతున్నారు
 చంద్రబాబూ.. మీ హయాంలో ఏ ఒక్క మంచి పని అయినా చేశానని చెప్పుకోగలవా? అని ప్ర‌శ్నించారు.  ఎన్టీ ఆర్ అంటే కిలో రెండు రూపాయల బియ్యం... వైయస్ గారు అంటే ఫీజురీయింబర్స్ మెంటు, ఆరోగ్యశ్రీ ... ఇప్పుడు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారు అంటే నవరత్నాల పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు అంటే స్కీముల పేర్లు గుర్తుకు రావు, అన్నీ స్కాములే అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.

Back to Top