పవన్‌ రాజకీయ నేతా..? ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నాడా..?

విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ 

కృష్ణా జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని

కృష్ణా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా..? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నాడా..? అని కృష్ణా జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. విశాఖ నుంచి కదలనని మాట్లాడిన పవన్‌ ఎందుకు వెళ్లిపోయాడని ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. షూటింగ్‌ గ్యాప్‌లో చంద్రబాబు అజెండా మోయడానికి పవన్‌ కల్యాణ్‌ విశాఖ టూర్‌ పెట్టుకున్నాడని విమర్శించారు. పవన్‌కు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకంటే.. చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు నాటకంలో పవన్‌ కీలుబొమ్మ: మంత్రి మేరుగు
చంద్రబాబు ఆడించే నాటకంలో పవన్‌ కల్యాణ్‌ కీలుబొమ్మ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ప్రజాప్రతినిధులపై దాడి చేయించేంతలా పవన్‌ కల్యాణ్‌ దిగజారతారని అనుకోలేదన్నారు. మంత్రులపై ఎవరు దాడి చేశారో ప్రజలంందరికీ తెలుసన్నారు. పవన్‌ రాజకీయాల్లో ఉండాలనుకుంటే తప్పును ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ గర్జన సక్సెస్‌ను ఓర్వలేకే మంత్రులపై దాడి చేయించారని మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

Back to Top