తాడేపల్లి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా.. దళితులకు అన్యాయం జరగదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: ఏ ఉద్యమాలూ లేకుండానే పేదలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్ గారు: - ఈ దేశంలో రేషన్ కార్డుల కోసం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం అనేక ఉద్యమాలు చూశాం. - కానీ ఏపీ చరిత్రలో ఏ ఉద్యమకారుడూ అడగకుండానే, ఉద్యమాలతో సంబంధం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. - వాటిలో అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడం, గిరిజనులకు ఆర్వోఆర్ పట్టాలు, చుక్కల భూములను 22ఏ నుంచి తీసేసిన వైనం అంతా చరిత్రలో ఎన్నడూ జరగనివే. - ఇదంతా ఎవరో అడిగితే చేసింది కాదు...ఇదొక గొప్ప ఆలోచన. - ఒక నాయకుడు పాదయాత్ర చేసి ప్రజల నుంచి ఇన్‌పుట్ తీసుకుని వారికేం చేయాలో గొప్పగా చేసి చూపిస్తున్న నాయకుడు జగన్ గారు. - మాటలు చెప్పే వాళ్లు చాలా మంది మోసాలు చేశారు..కానీ జగన్ గారు చేసి చూపించి సామాజిక విప్లవానికి తెరతీశారు. - ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్న నాయకులను చూశాం. - కానీ జగన్ గారి నేతృత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిస్తే వాటిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. - 2.07లక్షల ఉద్యోగాలిస్తే వాటిలో 80 శాతం పైగా బడుగు బలహీన వర్గాలకే. - 2.40 లక్షల కోట్ల డీబీటీ ఆశ్రిత పక్షపాతం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరింది. - అదీ పరిపాలన అంటే. బడుగు బలహీనవర్గాలను అక్కున చేర్చుకోవడం అంటే ఇది. - చంద్రబాబుకు అధికారం ఇస్తే పేదల సొత్తును పంచుకుతిన్నాడు. కొడుకుకు పంచిపెట్టాడు. - ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతోంది. - ఎన్నికల మేనిఫెస్టోలో వందకు వందశాతం అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్‌గారు నిలిచారు. - ఎక్కడో కూర్చుని మాట్లాడటం కాదు. బాబుకు, కొడుకుకు ఈ రాష్ట్రంలో ఇళ్లు కూడా ఉండదు. - అద్దెకు తెచ్చుకున్న నాయకుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటాడు. - చంద్రబాబు ముఖ్యమంత్రిగా పెట్టిన తొలిసంతకాలకు కూడా దిక్కులేని పరిస్థితి. - ఈ రాష్ట్రంలో చెప్పినవి చెప్పినట్లు చేసిన పేద ప్రజల గుండె చప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు. వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు: - నిన్న కొవ్వూరులో జరిగిన సంఘటన నిజంగా బాధేసింది. నాకన్నా ముఖ్యమంత్రి గారికి చాలా బాధేసింది. - ఒక దళిత యువకుడు కొవ్వూరులో ఆత్మహత్య చేసుకుని చనిపోతే వెంటనే స్పందించి నన్ను, శాసనసభ్యుడిని పంపి ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పారు. వారికి అండగా కొంత సాయం చేశాం.. - దాన్ని కూడా కొంతమంది చెల్లని చిత్తుకాగితం లాంటి వారు విమర్శిస్తున్నారు. - సంఘటనను రాజకీయాలకు వాడుకుంటూ సభ్యత మరచి మాట్లాడుతున్నారు. - మాకు బూతులు రావనుకుంటున్నారేమో...మీకంటే నాలుగింతలు బూతులు మాట్లాడగలం. - మాకు సభ్యత సంస్కారం ఉంది. రాజశేఖరరెడ్డి గారి శిష్యరికంలో పైకి వచ్చినవాళ్లం. - ఎవడెవడో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు. - దళిత యువకుడు చనిపోతే, ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచింది. - దాన్ని కూడా రాజకీయాల్లో చెల్లని చిల్లుకాగితం లాంటి వారు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. - జగన్ గారు దళితులను పట్టించుకోవడం లేదంటూ కారుకూతలు కూస్తున్నారు. - కోట్ల రూపాయలతో మా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు - చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 12 శాతం ఉన్న పేదరికాన్ని జగన్ గారు 6 శాతానికి తగ్గిస్తే..ఓర్వలేక మాట్లాడుతున్నారు. - పేదరికం తగ్గింది..దళిత, గిరిజన, బహుజనులు ఈ రాష్ట్రంలో గుండెమీద చేయి వేసుకుని బతుకుతున్నారు. - అలాంటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై గుడ్డ కాల్చి వేయవద్దు. చెల్లని చిత్తుకాగితం లాంటి వారు జగన్ గారి గురించి మాట్లాడితే శంకరగిరి మాన్యాలు తప్పవు - జడా శ్రావణ్‌కుమార్ అనే వ్యక్తి జ్ఞానం లేని, డబ్బులకు అమ్ముడుపోయే వాడు, చంద్రబాబు చెంచాగిరీ చేసుకునే వాడు. - రోజు చంద్రబాబు వద్ద అడుక్కునే నువ్వా మమ్మల్ని విమర్శించేది..నీ బతుకేంటి..? - దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు సంకనాకుతూ, అతని దగ్గర డబ్బులు తీసుకుని నువ్వా మా గురించి మాట్లాడేది..? - దళిత చట్టాలను, దళిత సక్షేమాన్ని అపహాస్యం చేసిన మూర్కుడు చంద్రబాబుకు ఒత్తాసు పలికితే చరిత్ర హీనులవుతారు. - ఈ రాష్ట్రంలో అంబేద్కర్ భావజాలం తొణికిసలాడుతున్న ప్రభుత్వం మాది. - బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భుజాన వేసుకుని పాలన సాగిస్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. - అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్ల పొదల్లో పెడతానని చెప్పి వెళ్లిపోయిన మూర్ఖుడు చంద్రబాబు దగ్గర చేరి మమ్మల్ని విమర్శిస్తారా? - దళిత యువకుడు చనిపోతే..ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. - మీలాగా శ్రీకాకుళంలో టీడీపీ నాయకుడు ఎస్సీ అమ్మాయిపై దాడి చేస్తే దిక్కులేదు. - మాదిగ సోదరులను చెట్టుకు కట్టేస్తే చంద్రబాబు కళ్లుండి చూడలేని వాడిలా ఉన్నాడు. - చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు దళితులు మురికివారు అంటే దిక్కులేదు. - రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అఘాయిత్యాలు జరిగితే కళ్లు లేని కబోదిలా ఉండి ఇప్పుడు దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. - తస్మాత్ జాగ్రత్త...ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ గారిది. - ఆరు నూరైనా...దళితుల కోసం నిరంతరం పనిచేసే కుటుంబం వైఎస్ కుటుంబం. - మాకు, జగన్ గారికి రక్త సంబంధం ఉంది..దళితులంటే అంటుగా భావించేది మీ చంద్రబాబే. అలాంటి వ్యక్తి వద్ద చప్రాసీ ఉద్యోగం ఎందుకు..? - మీకు చేతనైతే దళిత కుటుంబానికి సాయం చేయండి. మీరు కొట్టేసిన కోట్లను పంచండి. - చెల్లని వారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడితే శంకరగిరి మాన్యాలు తప్పవు. - పేద ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తుందనే అక్కసుతో చంద్రబాబు మిమ్మల్ని డూడూ బసవన్నల్లా ఆడిస్తున్నాడు. బాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై చర్చకు సిద్ధమా?: - నేను చాలెంజ్ చేస్తున్నా..చంద్రబాబు నీ టెన్యూర్‌లో మా మీదపై దాడులు, ఆఘాయిత్యాలు, వివస్త్రలను చేసిన సంఘటనలపై చర్చించే దమ్ముందా? - ప్రతి దానికీ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు. సంఘటన జరగగానే ఆయన రియాక్ట్ అయిన తీరును చూడాలి. - ఒక వ్యక్తి తప్పిదం వల్ల సంఘటన జరిగి ఉండొచ్చు..కానీ ప్రభుత్వం రియాక్ట్ అయ్యే తీరు చూడండి. - అంతేకానీ...చెల్లని కాగితం లాంటి వారు మాట్లాడితే విలువే లేదు. - చట్టాలున్నాయని, నువ్వు ఎస్సీ అయ్యావని ఇష్టారీతిన తిడుతుంటే జవాబుదారీతనం ఎక్కడ..? - నేను తప్పు చేసినా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకునే వ్యక్తి కాదు. - ఈ కేసు విషయంలో తప్పు చేసిన వారి పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో మీరూ చూస్తారు. - వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు, పేదలకు అన్యాయం జరిగే పరిస్థితే ఉండదు.