వెంకటాయపాలెం: ప్రజాస్వామ్యవాదులంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బలపరచాలని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున కోరారు. వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. నమస్కారం, ఈరోజు సామాజిక న్యాయానికి పండుగ రోజు, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో ఇళ్ళస్ధలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు, ధర్నాలు చేసేవి, కానీ అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, వారు చంద్రబాబు పంచన చేరి ఇళ్ళస్ధలాలు ఇక్కడ వద్దంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారు, ఆయన్ను రాబోయే రోజుల్లో ఈ పేదలు వెంటబడి తరుముతారు. పేదల ఇళ్ళ స్ధలాలు ఇవ్వకూడదని కోర్టులకెళ్ళారు, పేదలకు అండగా ఉండాలని సీఎంగారు ముందుకెళుతున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటున్నారు, ఆరునూరైనా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతున్నారు, ప్రజాస్వామ్యవాదులంతా జగన్ గారిని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్నామేమంతా మీ వెంటే ఉంటాం: గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగిన యుద్దంలో సుప్రిం సైతం పేదల పక్షాన నిలబడితే, పేదలకు ఇళ్ళస్ధలాలు వద్దు అని పెత్తందార్ల పక్షాన నిలబడ్డ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు. 31 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తుంటే దానిని అడ్డుకుంటున్నారు, రాజధానిలో పేదలు నివసించకూడదని, పేదలు పాలేర్లుగా ఉండాలనే విధంగా సుప్రింకు వెళ్ళారు. చంద్రబాబు పెత్తందార్ల పక్షాన ఉంటే మన జగనన్న పేదల వెంట ఉన్నారు, జగనన్నామేమంతా మీ వెంటే ఉంటాం, 2024లో మరోసారి సీఎం చేద్దాం, మనమంతా జగనన్న వెంట ఉందాం. గొట్టిముక్కల హైమావతి, లబ్ధిదారు, తాడేపల్లి మున్సిపాలిటీ అన్నా నాది పేద కుటుంబం, మేం రైల్వే పోరంబోకు స్ధలంలో ఇల్లు వేసుకుని ఉంటున్నాం. మాలాగే 750 కుటుంబాలు ఉన్నాయి, రైల్వే వారు నోటీసులు ఇచ్చారు, ఏం చేయాలో అర్ధం కాలేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎండకు ఎండి వానకు తడిశాం, నాకు ఇంటి స్ధలం వచ్చిందని చాలా ఆనందపడ్డాం, గజం భూమి కూడా కొనుక్కోలేని మాకు గుంటూరు, విజయవాడ మధ్యలో లక్షల విలువైన భూమిని ఇస్తున్నారు. మీరు లక్షల మందికి పట్టాలివ్వడమే కాదు వారిని ఆస్తిపరులను చేశారు, కుట్రలు, రాజకీయంతో మాకు రాకుండా చేశారు, పేదలు ఉంటే స్లమ్ లుగా మారుతాయన్నారు, అవన్నీ మీరు ధీటుగా ఎదుర్కొన్నారు. మాకు ఇది గొప్ప పండుగ, మీ మధ్యలో ఈ పండుగ చేసుకుంటున్నాం. నవులూరులో నాకు వచ్చిన స్ధలం చూడగానే సంతోషమేసింది. అక్కడ ఉన్న ఏర్పాట్లు చాలా బావున్నాయి, నేను ఇల్లు కట్టగానే మీరు గృహప్రవేశానికి రావాలని కోరుతున్నాను. మా పేదలకు మీరు తోడుగా ఉన్నారు. మీ చెరగని చిరునవ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం, దుష్టశక్తులకు తగిన బుద్దిచెబుతాం, మా మహిళలంతా మీ వెంటే నడుస్తామని చెబుతున్నాను, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నాను. లక్ష్మీ, లబ్ధిదారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అన్నా నేను ఒక బీసీ వర్గానికి చెందిన మధ్యతరగతి మహిళను, నాకు వివాహం అయి 25 ఏళ్ళు అయింది, నా భర్త హోటల్లో పనిచేస్తారు, నాకు ముగ్గురు పిల్లలు. నాకు వివాహం అయిన కొత్తలో ఎదుర్కున్న సమస్యను చెప్పాలనుకున్నాను, మా అత్తగారి అమ్మ చనిపోతే ఆ అద్దె ఇంటి యజమాని శవాన్ని ఉంచనీయలేదు, అప్పుడు చాలా క్షోభను అనుభవించాను, అద్దె పెరిగినప్పుడల్లా ఇల్లు మారుతూ జీవనం కొనసాగించాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. మేం నమ్మి దరఖాస్తు చేశాం. మీరు పేదలకు ఇళ్ళు అనే మహాయాగం ప్రారంభిస్తే ప్రతిపక్ష నాయకులు మారీచుడిలా అడ్డపడినా మీరు శ్రీరాముడిలా జయించి, వారిని ఎదిరించి మాకు యాగఫలం అందించారు. ఆ యాగ ఫలితమే ఈ పండుగ, నాతో పాటు యాభై వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు, ఏ అన్నైనా పుట్టింటికి వెళితే ఒక చీర పెడతారు లేక ఒకరోజు భోజనం పెడతారు కానీ ఏ అన్నైనా ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పట్టాల పంపిణీకి ఆహ్వనించి మీ సొంతింటి కల సాకారం చేసుకోమనే అన్న ఎవరైనా ఉన్నారా, అలాంటి అన్న నాకు ఉన్నారు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, నాకు ముగ్గురు పిల్లలు, వారిని బాగా చదివించడం కత్తి మీద సాము, నా పెద్దపాప పీజీ చదువుతుంది, చిన్నపాప బీటెక్ చదువుతుంది, విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా నేను చదివించగలుగుతున్నాను, మీరు అమ్మలా ఆదరిస్తున్నారు, నాన్నలా మా భారం మోస్తున్నారు, అన్నలా మీ అనురాగం పంచుతున్నారు, మీ చల్లని నీడలో మేం సుస్ధిరంగా ఉండాలనుకుంటున్నాం, మాకు కేటాయించిన స్ధలం చూసినప్పుడు చాలా సంతోషమేసింది, చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మా గృహప్రవేశాల పండుగకు రావాలి, దేవుడంటే ఎవరు అడిగిన వరాలిచ్చేవారు కానీ నా కుటుంబంలో నేను ఏదీ అడక్కుండానే, ఏదీ కోరుకోకుండానే అన్ని వరాలిచ్చిన మీరే నా ప్రత్యక్ష దైవం, మీరు ఉదయించే సూర్యుడు, మీరు ఒక ప్రభంజనం, మా మహిళలకు ఒక ధైర్యం, భరోసా, బలగం మీరు. మీరే మళ్ళీ సీఎంగా రావాలి, మా ఓట్లు మీకే, మీ చల్లని పాలన సుస్ధిర కాలం ఉండాలి.