గుంటూరు: కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో మంత్రి మేరుగ నాగార్జున గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెరవేసిన ప్రజలందరి ప్రభుత్వం మనదని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కలుసుకుని వారు పొందిన సంక్షేమ పథకాలను తెలియచేస్తూ ప్రజల వద్ద నుంచి పెద్ద యెత్తున ఆశీర్వాదములు పొందారు.
మంత్రి మేరుగ నాగార్జున గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు పొందిన ప్రయోజనాన్ని తెలియ చేయడంతో పాటు వారు పొందుతున్న పథకాల వివరాలతో సీఎం వైయస్ జగన్ స్వయానా సంతకం చేసిన కరపత్రాన్ని, ప్రభుత్వం 3 ఏళ్ల పాలనా కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన బుక్ లెట్‌ను మంత్రి అందజేశారు. అర్హత ఉండి ఇంకేమైనా సంక్షేమ పథకాలు అందకపోయినా, వారికి గల ఇబ్బందులను సహితం అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కొరకు అధికారులకు ఆదేశించారు. సీఎం వైయస్ జగ న్‌ను మీరంతా మనస్ఫూర్తిగా దీవించాలని మంత్రి ప్రతీ గడపలో ప్రజలను కోరారు.