దశాబ్దాల కల నిజం చేస్తాం

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

నెల్లూరు: సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రెండో ఫేజ్‌ పనులు త్వరలో పూర్తి చేసి ప్రజల  దశాబ్దాల కల నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు, నీళ్లు లేవన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి∙ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. అనంతరం సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌ రెడ్డి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top