ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదే

 మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి

తాడేప‌ల్లి:  ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదేన‌ని మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి తెలిపారు. ఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌ కు ఊతమిస్తూ రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీ లీడర్‌షిప్‌ ద్వారా గత రెండేళ్లుగా కోవిడ్‌ ఉన్నా మీరు ముందుచూపుతో ఆ రోజు మనం తప్పనిసరిగా ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ను మనం సపోర్ట్‌ చేయాలని, వ్యాపారరంగానికి ఇది వెన్నెముక అని ఆ రోజు దాదాపు రూ. 1100 కోట్ల ఇన్సెంటివ్‌లు విడుదల చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే సీఎంగారు అన్ని రంగాల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తున్నారు. కోవిడ్‌ పరిస్ధితుల్లో మొట్టమొదటగా ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. జీడీపీ లెక్కల ప్రకారం దీని ద్వారా మన ఎకానమీ 1.6 శాతం పాజిటివ్‌ గ్రోత్‌ ఉంది, మనం ప్రజలకిస్తున్న డబ్బు ఆర్ధికరంగంలో కీలకపాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో కోవిడ్‌ తదనంతర పరిణామాలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీరు అన్నారు, దానిని దృష్టిలో ఉంచుకుని మీ నాయకత్వంలో గొప్ప ఇండస్ట్రియల్‌ పాలసీని తీసుకొస్తున్నాం. ఇన్వెస్టిమెంట్‌ ఫ్రెండ్లీ, రిస్క్‌ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్‌ తీసుకొస్తున్నాం. పారిశ్రామిక అభివృద్దికి ఇది ఎంతో దోహదపడుతుంది. అంతేకాక మేం గ్రీన్, క్లీన్‌ ప్రొడక్షన్‌ మెధడాలజీ తీసుకొస్తున్నాం. అంతేకాక మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు రాష్ట్ర అభివృద్దికి కీలకంగా మారాయి. ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా మీరు చెప్పినట్లు పరిశ్రమల వ్యర్ధాలపై ప్రత్యేక దృష్టిసారించాం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్దికి మీరు తీసుకుంటున్న చర్యలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. మీ నాయకత్వంలో వివిధ రంగాలలో చేస్తున్న అభివృద్ది వల్ల మన రాష్ట్రం రోల్‌మోడల్‌గా మారింది.  

వీరవర్ధిని, లబ్దిదారు, తాడికొండ, గుంటూరు జిల్లా

సార్‌ నేను బీటెక్‌ పూర్తిచేశాను, ఒక ఇండస్ట్రీ నడపాలని ఎమ్మెల్యే శ్రీదేవి గారిని అడిగాను, జగనన్న బడుగు వికాసం పధకం కింద సబ్సిడీ ఇస్తున్నారని చెప్పారు. నేను రూ. 44 లక్షలతో హెచ్‌పీసీఎల్‌ ఎల్‌పీజీ ట్యాంకర్‌ కొనుగోలు చేశాను, దానిపై నాకు 38 లక్షల లోన్‌ వచ్చింది, సబ్సిడీ గురించి జిల్లా పరిశ్రమల శాఖ వారిని సంప్రదిస్తే నాకు రూ. 19.75 లక్షల సబ్సిడీ మంజూరు చేయడం వల్ల నాలాంటి ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవారికి ప్రోత్సాహం లభించింది. నాలాగా చదువుకున్న మహిళలకు మీరు గొప్పగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మేం చాలా సంతోషంగా ఉన్నాం సార్‌. నేను ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుని లబ్దిపొందాను. మీలాంటి గొప్పవారి సహాయ సహకారాలు మా జీవితాలతో వెలుగులు నింపుతున్నాయి సార్‌...ధ్యాంక్యూ

చిన్నబాబు, లబ్దిదారుడు, అగనంపూడి, విశాఖపట్నం జిల్లా

జగనన్నా నేను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేశాను. ఆ తర్వాత 2016లో అగనంపూడి ఇండస్ట్రియల్‌ పార్క్‌లో భూమి తీసుకుని నేను కొత్తగా టెక్నాలజీతో రూ. 35 లక్షలతో ఇండస్ట్రీ పెట్టాను, అందులో రూ. 12 లక్షలు ఇన్సెంటివ్‌ వచ్చింది. మెటీరియల్‌ సప్లై చేసిన బిల్స్‌ రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో మీరు చేసిన సాయం మాకు చాలా ఉపయోగపడింది. నేను మా అబ్బాయిని ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నాను, చాలా బావుంది, పిల్లల పట్ల ఉపాధ్యాయులు చాలా భాద్యతగా వ్యవహరిస్తున్నారు, మంచి ఆహారం ఇస్తున్నారు. అనేక మందికి ఉపాధి కల్పించాలని నేను ప్రయత్నిస్తున్నాను. మీరు చేస్తున్న సాయం వల్ల నా ఇండస్ట్రీని మరింతగా విస్తరించడానికి ఉపయోగపడుతుంది. 

మజ్జి పార్వతి, బొద్దాం గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా 

అన్నా నేను రూ. 1.50 కోట్ల లోన్‌ తీసుకుని బ్రిక్‌ యూనిట్‌ ప్రారంభించాను. నా దగ్గర 22 మంది పనిచేస్తున్నారు. అందరికీ నవరత్నాల పథకాలు అందుతున్నాయి, వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా కష్టకాలంలో వారిని నవరత్నాలు ద్వారా చాలా ఆదుకున్నారు. మేం ఆర్ధిక ఇబ్బందులతో పరిశ్రమను నడిపించలేని సమయంలో కూడా వారిని మీరు ఆదుకున్నారు. ఏ రాష్ట్ర భవిష్యత్‌ అయినా పారిశ్రామిక, వ్యవసాయ రంగాలే కీలకం. పారిశ్రామిక రంగం వల్ల ప్రజలకు ఉపాధి, ఆర్ధిక అవకాశాలు మెరుగుపడతాయి. ఎంఎస్‌ఎంఈలను మీరు ప్రోత్సహించి ప్రతీ ఏడాది కూడా రాయితీలు ఇస్తున్నారు. మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేము. కరోనా వల్ల బ్యాంకు ఈఎంఐలు కూడా కట్టలేని సమయంలో మీరు ఇచ్చిన సబ్సిడీ వల్ల ఎన్నటికీ మర్చిపోలేము. మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలు పొందిన వారు ఎవరైనా సరే ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు. మీ మేలును మాటల్లో చెప్పలేం. మీరు మా రియల్‌ హీరో. అక్కచెల్లెమ్మలు అందరూ మిమ్మల్ని బాగా అభిమానిస్తున్నారు. మళ్ళీ మీరే సీఎంగా కావాలి, ధ్యాంక్యూ అన్నా... 

సులోచన, లబ్దిదారు, నాయుడుపేట, నెల్లూరు జిల్లా

సార్, నేను నేను 2018లో నాయుడుపేటలో ఇండస్ట్రియల్‌ రబ్బర్‌ ఇండస్ట్రీని ప్రారంభించాను. ఈ మెటీరియల్‌ పోర్ట్‌లు, మైన్స్‌లోనూ, స్టీల్, సిమెంట్‌ ఫ్యాక్టరీలలో వాడుతారు. నేను రూ. 1.25 కోట్లు లోన్‌ ఏపీఎస్‌ఎఫ్‌సీ నుంచి తీసుకున్నాం. మా ఫ్యాక్టరీలో 25 మంది వర్కర్స్‌ పని చేస్తున్నారు, వారిని లోకల్‌గానే తీసుకుని వారికి ట్రైనింగ్‌ ఇచ్చి జాబ్‌ ఇచ్చాం. మా ప్రొడక్ట్స్‌ ఇతర రాష్ట్రాలకే కాక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. ఇటీవలే మలేషియాకు కూడా పంపాం. 2018లో ఇన్సెంటివ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాం కానీ రాలేదు. 2020లో మీరు ఇన్సెంటివ్‌లు ఇస్తామన్న మాట మాకు ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. మాలాగా కొత్తగా ఇండస్ట్రీ పెట్టిన వారికి ఇన్సెంటివ్‌లే ఆదుకుంటాయి, ఆర్డర్స్‌ రావడానికి టైం పడుతుంది, ఈలోపు ముడిపదార్ధాలకు డబ్బు వెచ్చించాలి. కోవిడ్‌ వల్ల మేం రావనుకున్నాం కానీ మీరు ఇన్సెంటివ్‌లు ఇచ్చారు. నాకు రూ. 40 లక్షలు శాంక్షన్‌ అయ్యాయి, అది కూడా లోన్‌లో క్రెడిట్‌ అవడం వల్ల నాకు లోన్‌ కట్టే అమౌంట్‌ తగ్గింది. దానివల్ల ముడిపదార్ధాలకు, ఉద్యోగుల జీతాలకు ఉపయోగించుకున్నాం. మీరు మమ్మల్నే కాదు మా వర్కర్స్‌ను కూడా బతికించారు. మళ్ళీ ఇప్పుడు రూ. 11 లక్షలు శాంక్షన్‌ చేశారు. ఈ కష్టకాలంలో మీరు మా చిన్న పరిశ్రమలకు చాలా మేలు చేస్తున్నారు. మా అందరి తరపునా మీకు ధన్యవాదాలు సార్‌. నవరత్నాలు ప్రతీ ఒక్కరికీ అందుతున్నాయి, నాకు అమ్మ ఒడి నచ్చింది. ఈ పథకం ద్వారా చాలామంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కోవిడ్‌ వల్ల లక్షల మంది ఆరోగ్యశ్రీతో లబ్దిపొందారు. వలంటీర్‌ వ్యవస్ధ చక్కగా పనిచేస్తుంది, వ్యాక్సినేషన్‌ బాగా జరిగింది. బడిలో నాడు నేడు చూస్తుంటే ఇప్పుడు దేవాలయాల్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది. ఇన్ని మంచి పనులు చేస్తున్న మీరు పదికాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను. మా చిన్న పరిశ్రమలకు మీరు ఊపిరిపోశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు సార్‌. 

రఘురామిరెడ్డి, టెక్స్‌టైల్స్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి

సీఎంగారు... టెక్స్‌టైల్‌ రంగం 2004–05లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి హయాంలో అభివృద్ది చెందింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ రంగాన్ని అశ్రద్ద చేశాయి, దీంతో రావాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా వాయిదా వేస్తూ మమ్మల్ని చాలాకాలం తిప్పుకున్నారు. గత ఐదారేళ్ళుగా ఈ రంగం కష్టాలను ఎదుర్కొంది. కోవిడ్‌ వల్ల పూర్తిగా కుదేలయిన సమయంలో మీరు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మీరు సబ్సిడీలు విడుదల చేయడం అంటే మాకు అమృతభాండాన్ని మాకు ఇచ్చినంత సంతోషంగా ఉంది. మీరిచ్చే సబ్సిడీ యాజమాన్యానికే కాదు ప్రతీ కార్మికుడికి కూడా మీరు సాయం చేసినవారు అయ్యారు. మీరు ఇస్తున్న చేయూత వల్ల మారంగానికి చాలా ఉపయోగకరం. టెక్స్‌టైల్‌ రంగం రాబోయే రోజుల్లో ఏపీలో పెద్ద పరిశ్రమగా అభివృద్ది చెందుతుంది. దేశంలోనే మనం స్పిన్నింగ్‌ రంగంలో అగ్రగామిగా ఉన్నాం, అలాగే వీవింగ్‌ రంగం కూడా అభివృద్ది చెందుతుంది. మరో ఇరవై, పాతిక వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయ రంగానికి మనం చేయూతనిచ్చిన వారవుతాం. మనం తయారుచేసే నూలును ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాం. మనకు సీపోర్ట్స్‌ దగ్గరగా ఉండడం, లాజిస్టిక్స్‌ ఉండడం వల్ల అభివృద్ది చేయగలుగుతాం. మీ సాయం వల్ల మేం మంచి పరిశ్రమను అభివృద్ది చేసి మీముందుంచుతాం. మీరు ప్రతీ రంగాన్ని ఆదుకుంటున్నారు, రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. మీరు దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అడుగుజాడల్లో మేం పయనిస్తాం, మాకు మీ చేయూత ఎప్పటికీ కావాలి సార్‌. ధన్యవాదాలు.

Back to Top