థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నాం

ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

తాడేపల్లి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రోజుకి 25 వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి సరిపడా కిట్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం నుంచే∙థర్మల్‌ స్కానర్లను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగామని, అన్నిరాష్ట్రాల కంటే ఏపీలోనే కరోనా స్క్రీనింగ్‌ బాగా జరుగుతుందన్నారు. కేవలం గ్రీన్‌ జోన్‌లో ఉన్న పరిశ్రమలకే అనుమతులిస్తున్నామని, ఇప్పటి వరకు 160 వరకు అనుమతులిచ్చామని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు చేపడుతున్నారన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

తాజా వీడియోలు

Back to Top