తాగునీటి కోసం త్వరలో కొత్త ప్రాజెక్టు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
 

నెల్లూరు: ఏపీలో తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు. పోలవరం పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరువు ఉండదన్నారు. ఆత్మకూరు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామన్నారు. 
 

Back to Top