సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపుతోనే కరోనా కట్టడి

నెల రోజుల్లో లక్ష కిట్లతో మరో 20 లక్షల పరీక్షలు చేస్తాం

ఇప్పటికే 50 వేల కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఉత్పత్తి చేశాం

రెండ్రోజుల్లో ఇండియన్‌ టెక్నాలజీతో వెంటిలేటర్లు తయారు చేస్తాం

ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతోనే రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగామని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రులు స్వయంగా అభినందిస్తున్నారన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా సీఎం వైయస్‌ జగన్‌ కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నారని చెప్పారు. సచివాలయంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 50 వేల కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఉత్పత్తి చేశాం. అన్ని జిల్లాలకు, మండలాలకు కోవిడ్‌ కిట్లను పంపిస్తున్నాం. కరోనా కిట్ల ద్వారా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తాం. మరో 50 వేల టెస్టింగ్‌ కిట్లను ఉత్పత్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కరోనా కిట్లతో 20 లక్షల పరీక్షలు నెలరోజుల్లో చేస్తాం. రెండు రోజుల్లో ఇండియన్‌ టెక్నాలజీతో వెంటిలేటర్లు తయారు చేస్తాం. సీఎం జగన్‌ ముందు చూపుతో ఇది సాధ్యమైంది. దేశంలో ఇది తొలిసారిగా ఏపీలో కరోనా కిట్స్‌ ఉత్పత్తి జరుగుతోంది. 35 రోజుల్లోనే టెస్టింగ్‌ కిట్ల ఉత్పత్తి చేశాం. సీఎం జగన్‌ను స్వయంగా కేంద్ర మంత్రులు అభినందిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంఎస్ఎంఈలను ఆదుకుంటాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు రాయితీలివ్వాలని సీఎం భావిస్తున్నారు. కోవిడ్‌తో నష్టపోయిన పరిశ్రమలను ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు చేపడుతున్నారు' అని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top