కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ

కాకికాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌పై చర్చ

ఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌పై కేంద్రమంత్రితో చర్చించారు. అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌కు కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దేశ వ్యాప్తంగా ఇథనాల్‌ ఉత్పత్తి పెంచే చర్యల్లో భాగంగా ఏపీకి రూ.1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. గత వారంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసి ఇచ్చిన అంశాలపై సైతం చర్చించానని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top