మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

వందల మంది ప్రాణాలను కాపాడిన రుయా వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 

చిత్తూరు: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్సిజన్‌ ప్రెజర్‌ తగ్గి 11 మంది చనిపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. ఆక్సిజన్‌ను వెంటనే పునరుద్ధరించి వందల మంది ప్రాణాలు కాపాడిన వైద్యులకు, సిబ్బందికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆదేశాల మేర‌కు రుయా ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కూడా జ‌రుగుతుంద‌న్నారు.

రుయా ఘటనలో సాంకేతిక సమస్య లేదు: ఎంపీ గురుమూర్తి
రుయా ఆస్పత్రి ఘటన బాధాకరమని తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి అన్నారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని, కేవలం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావడం ఆలస్యమవ్వడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top