తిరుపతిలో భారీ మెజార్టీతో గెలిపించండి  

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

నెల్లూరు: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమని, ఆ దిశగానే పరిపాలన సాగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది మహిళలు, పేదల ప్రభుత్వమన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి మేకపాటి గైతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఒట్టి ఎంవోయూలతో కాలక్షేపం చేసిందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని ఆచరణలో చూపిస్తుందన్నారు. 18 నెలల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలమంతా ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నామంటే.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధే కారణమన్నారు. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి గౌతమ్‌రెడ్డి కోరారు. 

 

Back to Top